ఏడో తరగతి పాసైతే చాలు..!
– ప్రీ ప్రైమరీ స్కూళ్లలో పోస్టులు
– ఖాళీగా ఉన్న పాఠశాలలు ఇవే..
– దరఖాస్తుల గడువు ఎప్పటి వరకు అంటే
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువకులకు విద్యాశాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. కేవలం 7వ తరగతి ఉత్తీర్ణతతోనే పాఠశాలలో పోస్టులకు అవకాశాలు కల్పిస్తున్నారు.

ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు జిల్లా విద్యాధికారి రేణుకాదేవి ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్లలో ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ మరియు ఆయా ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ పోస్టులకు కనీస అర్హత ఇంటర్ లేదా సమానమైన అర్హతను కలిగి ఉండాలన్నారు.

శిశు విద్య లేదా ప్రైమరీ టీచింగ్ లో అర్హత కలిగిన వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు వీరికి వయస్సు 18 నుండి 44 ఏళ్లు ఉండాలని తెలియజేశారు. ఎంపికైన వారికి గౌరవ వేతనం ఒక విద్యా సంవత్సరానికి 10 నెలలు మాత్రమే చెల్లించబడుతుందని తెలిపారు. జిల్లాస్థాయి ఎంపిక కమిటీ ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలియజేశారు. ఎంపికైన ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్కు తప్పనిసరిగా శిక్షణ ఇవ్వబడుతుందని తెలియజేశారు. ఇన్స్పెక్టర్ మరియు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు కచ్చితంగా ఆ గ్రామానికి చెందిన అభ్యర్థులై ఉండాలి. వారు నివాస ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. పూర్తిచేసిన దరఖాస్తులను జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో తేదీ 01.09.2025 నుండి 09.09.2025 వరకు సమర్పించాలి.

విద్య అర్హతలు, జత పరచ వలసిన పత్రాలు:
ఇన్స్ట్రక్టర్కు ఇంటర్మీడియట్, ఆయాకు ఏడవ తరగతి.
వయస్సు: 18సం నుంచి 44 సం. ఖాళీ పోస్టులను కింద చూడండి..
ప్రీ ప్రైమరీ పాఠశాలలు”
1. ఎంపీపీఎస్ బాస్వాపూర్
2. ఎంపీపీఎస్ నవాండ్గి
3. ఎంపీపీఎస్ డామార్చెడ్
4. ఎంపీయుపిఎస్ సాలిమ్‌డాపూర్
5. ఎంపీపీఎస్ KANMANKAL VA
6. Mpps Takryyaniak thanda
7. ఎంపీయుపిఎస్ డోర్నల్
8. ఎంపీపీఎస్ ఇలాబాద్ టాండా
9. ఎంపీపీఎస్ ఐనాపూర్
10. ఎంపీపీఎస్ Allapur
11. ఎంపీపీఎస్ పోల్కాంపల్లి
12. MPUPS Gouraram
13. MPPS Nazkhanpally
14. ఎంపీపీఎస్ Ak Tanda
15. ఎంపీపీఎస్ అన్నాసాగర్
16. ఎంపీపీఎస్ రామ్రేడి పల్లి
17. ఎంపీపీఎస్ KATTEPAHAD TANDA
18. ఎంపీపీఎస్ మల్లికార్జునాగిరి
19. ఎంపీయుపిఎస్ పిల్లిగండ్లా
20. ఎంపీపీఎస్ షాపూర్
21. ఎంపీయుపిఎస్ చక్రాంపల్లి
22. ఎంపిపిఎస్ లాచియానయక్ టాండా
23. ఎంపీపీఎస్ YENKEYPALLY
24. MPPS Keshavapally
25. ఎంపీపీఎస్ రంగపూర్
26. ఎంపీయుపిఎస్ ఖుద్వాండపూర్
27. ఎంపీపీఎస్ ravulapally
28. MPUPS Mallemoniguda
29. ఎంపీపీఎస్ సయ్యద్ మాల్కాపూర్
30. MPPS Ogipur
31. ఎంపీపీఎస్ చెన్‌గెష్ పూర్
32. ఎంపిపిఎస్ సాంగెంఖుర్దు
33. ఎంపీయుపిఎస్ చెన్నరం

ఇదికూడా చదవండి…

