రైల్వే ప్రయాణికులకు సౌలభ్యం
– సమాచార, గనుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి
– తాండూరులో పర్బణీ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన మంత్రి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నుంచి కర్ణాటక వెళ్లే ప్రయాణికులకు కొత్త రైలు సేవలతో మరింత సౌలభ్యం కలుగుతుందని రాష్ట్ర సమాచార, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. దక్షిణ మధ్య రైల్వే శాఖ పరిధిలో తాండూరు మీదుగా నడుస్తున్న నాందేడ్ పర్బణీ ఎక్స్ ప్రెస్ రైలును కర్ణాటక రాష్ట్రం రాయచూర్ వరకు పొడగించారు. ఈ రైలు రవాణా సేవలు సోమవారం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు.
దీంతో తాండూరు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పొడగించిన పర్బణీ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి. మాట్లాడుతూ ప్రాంతాల అభివృద్ధిలో రవాణా సౌకర్యం కీలకమన్నారు. రైల్వే ప్రయాణికుల కోసం పర్బణీ ఎక్స్ ప్రెస్ రైలును కర్ణాటక వరకు పొడగించడం సంతోషకరమన్నారు. ఈ పొడగింపు సేవలతో తాండూరు – కర్ణాటక ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుందన్నారు. ఈ సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు సాయిపూర్ బాల్ రెడ్డి, బోయరాజు, బిర్కడ్ రఘు, అశోక్, రైల్వే అధికారులు, సిబ్బంది. పలు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

