రోజూ రూ.7 పెట్టుబ‌డితో యేటా రూ.60 వేల పెన్ష‌న్

ఆరోగ్యం కెరీర్ జాతీయం తెలంగాణ హైదరాబాద్

రోజూ రూ.7 పెట్టుబ‌డితో యేటా రూ.60 వేల పెన్ష‌న్
– అసంఘిత కార్మికుల‌కు వ‌రం అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న
– అర్హులైన ల‌బ్దిదారులు ద‌రఖాస్తు చేసుకొండి ఇలా
ద‌ర్శిని డెస్క్: దేశంలోని అసంఘ‌టిత రంగ కార్మికులకు అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న (ఏపీవై) వ‌రంగా మారింది. 2015 మే 9న ప్రారంభించిన ఈ ప‌థ‌కంలో ప్ర‌స్తుతం ఈ స్కీంలో దాదాపు నాలుగు కోట్ల మంది స‌బ్‌స్క్రైబ‌ర్లు ఉన్నారు. నేష‌న‌ల్ పెన్ష‌న్ స్కీం (ఎన్పీఎస్‌) ద్వారా ఈ ప‌థ‌కాన్ని కేంద్రం నిర్వ‌హిస్తుంది. ఈ ప‌థ‌కంలో చేరిన వారు రోజూ రూ. 7లు చెల్లిస్తే 60 ఏళ్ల త‌రువాత రూ. 60 వేల పెన్ష‌న్ పొంద‌వ‌చ్చు. అర్హులంద‌రు ఈ ప‌థ‌కాన్ని ద‌ర‌ఖాస్తు ఏవిధంగా చేసుకోవ‌చ్చు తెలుసుకోంది.
– స‌ద‌రు అసంఘ‌టిత కార్మికుడు భార‌తీయ పౌరుడై ఉండాలి. అలాగే ఏపీవైలో చేర‌డానికి 18-40 ఏండ్ల మ‌ధ్య వ‌య‌స్కుడై ఉండ‌టంతోపాటు ఒక బ్యాంకులో ఖాతా తెర‌వాలి.
– 60 ఏండ్ల వ‌య‌స్సు త‌ర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్లు ల‌భిస్తాయి.
– ఈ ప‌థ‌కంలో చేరిన వారికి మ‌ర‌ణించే వ‌ర‌కు పెన్ష‌న్ ల‌భిస్తుంది.
– ఈ ప‌థ‌కంలో చేరిన వారు మ‌ర‌ణిస్తే వారి జీవిత భాగ‌స్వామి మ‌ర‌ణించే వ‌ర‌కూ పెన్ష‌న్ పొందొచ్చు.
– ఈ ప‌థ‌కంలో రోజూ రూ.7 పెట్టుబ‌డిగా పెడితే రూ.60 వేల పెన్ష‌న్ ల‌భిస్తుంది.
– 18 ఏండ్ల వ‌య‌స్సు నుంచే అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న ప‌థ‌కంలో పెట్టుబ‌డి ప్రారంభించాలి. నాటి నుంచి 42 ఏండ్ల పాటు ప్ర‌తి నెలా రూ.210 చెల్లిస్తే రిటైర్మెంట్ తేదీ నాటికి నెల‌కు రూ.5000 పెన్ష‌న్ ల‌భిస్తుంది. ఏడాదిలో రూ.60 వేల పెన్ష‌న్ పొందొచ్చు. ఈ ప‌థ‌కంలో స‌భ్యులుగా చేరాక ప్ర‌తి నెలా ప్రీమియం రూ.210 త‌ప్ప‌నిస‌రిగా చెల్లిస్తూనే ఉండాలి.

అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌లో పెట్టుబ‌డి పెట్ట‌డానికి ఏం చేయాలంటే..
– ఏపీవై అధికారిక వెబ్‌సైట్ https://enps.nsdl.com/eNPS/NationalPensionSystem.html websiteకు వెళ్లాలి.
– మీ వ్య‌క్తిగ‌త‌, ఆధార్ కార్డు వివ‌రాలు న‌మోదు చేయాలి
– ఆధార్‌తో అనుసంధాన‌మైన మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని కూడా ఎంట‌ర్ చేస్తే ఓటీపీ వెరిఫికేష‌న్ పూర్త‌వుతుంది.
– అటుపై బ్యాంక్ ఖాతా వివ‌రాలు _ ఖాతా నంబ‌ర్‌, ఐఎఫ్ఎస్సీ కోడ్ న‌మోదు చేయాలి.
– ప్ర‌క్రియ పూర్త‌యిన త‌ర్వాత ఖాతా యాక్టివేట్ అవుతుంది.
– నామినీ వివ‌రాలు న‌మోదు చేసిన త‌ర్వాత ప్రీమియం పేమెంట్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలి.
– ఈ-సైన్ చేస్తే అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌లో మీ రిజిస్ట్రేష‌న్ పూర్త‌యిన‌ట్లే.