నో చాన్స్..!

క్రైం తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

నో చాన్స్..!
– విచారణకు రావాల్సిందే
– పైలెట్‌కు షాక్ ఇచ్చిన ఈడీ
– సీఎం కేసీఆర్‌తో రోహిత్ రెడ్డి భేటి

హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: ఈడీ అధికారులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి షాక్ ఇచ్చారు. నో చాన్స్ విచారణకు హాజరు కావాల్సిందేనంటూ సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కేసులో నోటీసుల జారీ కలకలం రేపిన విషయం తెలిసిందే. కర్ణాటక డ్రగ్స్‌ కేసు విషయంలో ఈడీ అధికారులు తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డికి నోటీసులు ఇవ్వడం.. ఈరోజు విచారణకు హాజరుకావాలని సూచించడం జరిగింది. దీంతో ఈడీ ఎదుట రోహిత్ హాజరవుతారా.. లేదా అనేది రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. విచారణకు హాజరు కావాల్సిన పైలెట్ రోహిత్ రెడ్డి తనకు సమయం ఇవ్వాలని ఈడీకి లేఖ రాసి ట్విస్ట్ ఇచ్చారు. లేఖలో విచారణకు హాజరయ్యేందుకు సమయం కావాలని కోరారు. ఈనెల 31 వరకు గడువు కావాలంటూ రోహిత్ రెడ్డి లేఖ రాశారు. దీనికి ఈడీ అభ్యంతరం తెలిసింది. రోహిత్ రెడ్డి విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించి.. మధ్యాహ్నం 3 గంటలకు ఈడీ కార్యాలయానికి రావాలని ఆదేశించింది.

సీఎం కేసీఆర్‌తో రోహిత్ రెడ్డి భేటి
మరోవైపు.. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రగతి భవన్‌కు చేరుకుని సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో రోహిత్ రెడ్డి.. కేసీఆర్ ను కలవడం.. ఈడీకి విచారణకు హాజరుకాలేనంటూ లేఖ రాయడం, ఈడీ ఆ విజ్ఞప్తిని తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది.