
సింధు అమ్మాయిలు అంటే భళా అనాలి..!
– అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణించాలి
– సింధూ కాలేజీ వ్యవస్థాపకులు రంగారావు, విజయాదేవి
– ఆట్టహాసంగా కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు
తాండూరు దర్శిని ప్రతినిధి : తాండూరు సింధు కాలేజీ అమ్మాయిలు అంటే అందరు భళా అనిపించుకోవాలని, అన్ని రంగాల్లో తమదైన ముద్రవేస్తూ ముందుకు సాగాలని తాండూరు సింధు బాలికల జూనియర్ కళాశాల వ్యవస్థాపకులు వి.రంగావు, విజయదేవిలు అన్నారు.

శనివారం తాండూరు పట్టణం మంతటి ఫాండయ్య ఫంక్షన్ హాల్ లో సింధు కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకలు అట్టహాసంగా జరుపుకున్నారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన రంగారావు, విజయదేవి చేతుల మీదుగా ద్వితీయ సంవత్సరంలో స్టేట్ టాపర్, ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినిలకు నగదు ప్రోత్సహక బహుమతులు అందజేశారు.

స్టేట్ ర్యాంకర్లు అయిన ఆఫ్రీన్(బైపీసీ)కు రూ. 10వేలు, సఫూర(సీఈసీ)కు రూ. 7వేల 500లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలేజీ అమ్మాయిలు ఉన్నంతగా ఎదగాలని ఆకాంక్షించారు. చదువును నిర్లక్ష్యం చేయకుండా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు నిరంతర సాధనతో విజయాలను సొంతం చేసుకోవాలన్నారు. మరోవైపు విద్యార్థినిలు డ్యాన్సులు, చిందులతో ఫ్రెషర్స్ డేలో సందడిగా గడిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సంగీత, అద్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

