బక్రిద్‌కు పటిష్ట భద్రత..!
– బందోబస్తు ఏర్పాట్లకు ప్రత్యేక దృష్టి
– వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
– తాండూరు ఈద్గా మైదానం సందర్శన
తాండూరు, దర్శిని ప్రతినిధి : బక్రీద్ పండుగ సందర్భంగా పటిష్ట భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. శుక్రవారం తాండూరు పట్టణం చెన్ గేష్ పూర్ రోడ్డు మార్గంలోని ఈద్గా మైదానాన్ని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్, సీఐలు రాజేందర్ రెడ్డి, రాంబాలులతో కలిసి సందర్శించారు. ఈద్గా మైదానంలో ముస్లిం సోదరుల ప్రార్థనా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మాట్లాడుతూ పండుగలను ప్రజలంతా సామరస్యతతో జరుపుకోవాలన్నారు. బక్రీద్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈద్గా మైదానంలో జాగ్రత్తలు, ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. బక్రీద్ సందర్భంగా జిల్లాలో పటిష్టమైన భద్రత, బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. పండుగను ప్రశాంతంగా జరుపుకుని పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పోలీసు అధికారులతో సమావేశం అయ్యారు. పండుగను ప్రశాంతంగా నిర్వహించేందుకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఈద్గా చైర్మన్ యూసుఫ్ ఖాన్, మైనార్టీ నాయకులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.




