అట్లుంటది.. మరీ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అట్లుంటది.. మరీ..!
– పండగ కిక్కులో మందుబాబుల రికార్డు
– తాండూరులో తెగ తాగేశారు..భయ్యా..
– ఎన్ని కోట్ల మందు తాగారో.. తెలుసా..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : వామ్మో.. మందుబాబులు అంటే మామూలోళ్లు కాదు.. భయ్యా.. పండగోస్తే మాతో అట్లుంటది.. మరీ.. నిరూపించారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో మందుబాబుల వల్ల రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. గత యేడాదితో పాటు ఈ సారి జరిగిన మద్యం విక్రయాల అధికారులు వెల్లడించారు.

గతేడాది ఇదే సీజనులో రూ.9.03 కోట్ల కాగా.. ఈసారి రూ.11.98 కోట్ల మద్యం అమ్మకాలు అయ్యాయని జిల్లా ఆబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మద్యం అమ్మకాలతోపాటు మాంసం దుకాణాలు కూడా బంద్ అయ్యాయి. దీని ఎఫెక్ట్ దసరా పండుగపై పడింది. అక్టోబర్ 2న గాంధీ జయంతితోపాటు దసరా పండుగ కూడా వచ్చింది. ఆ రోజు మద్యం షాపుల బంద్ నేపథ్యంలో, ఒకరోజు ముందుగానే అంటే అక్టోబర్ 1వ తేదీనే వైన్ షాపుల దగ్గర రద్దీ పెరిగింది. వైన్ షాపులు, లిక్కర్ మార్టుల ముందు మందుబాబులు క్యూ కట్టిన పరిస్థితి కనిపించింది.
kvcs
తాండూరు పట్టణంతోపాటు యాలాల, తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్‌ మండలాల్లో కలిపి మొత్తం రూ.1.86 కోట్ల మద్యం విక్రయాలయ్యాయి. సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు ఒకటో తేదీ వరకు 1.80 లక్షల లీటర్ల మద్యం, 1.47 లక్షల బీరు సీసాలు అమ్ముడయ్యాయి. కర్ణాటకకు సరిహద్దులోని మద్యం దుకాణాల్లో విక్రయాలు పెరిగాయి. కర్ణాటకలో ధర ఎక్కువగా ఉండడంతో సరిహద్దు ప్రాంతాలైన తాండూరు, బషీరాబాద్, పెద్దేముల్, రావులపల్లి, బంట్వారంలో ఎక్కువగా కొన్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో 59 మద్యం దుకాణాలుండగా.. సెప్టెంబరులో రూ.54.70 కోట్లు.. గతేడాది ఇదే నెలలలో రూ.54.23 కోట్ల మద్యం విక్రయించారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో ఈసారి రూ.2.95 కోట్ల మద్యం అదనంగా సేల్స్ జరిగాయని అధికారులు స్పష్టం చేశారు.

ఇదికూడా చదవండి…

టెంట్‌ హౌస్‌లో అగ్ని ప్రమాదం