పారదర్శకంగా రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయం
– వచ్చే నెల 14న ప్లాట్ల వేలం
– వికారాబాద్ అడిషనల్ కలెక్టర్ మోతిలాల్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని రాజీవ్ స్వగృహ ప్లాట్లను పారదర్శకంగా వేలం వేయడం. జరుగుతుందని వికారాబాద్ జిల్లా అడిషల్ కలెక్టర్ మోతిలాల్ అన్నారు. శుక్రవారం తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో రాజీవ్ స్వగృహా ప్లాట్ల వేలంలో పాల్గోనే వారికి ప్రీబిడ్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన అడిషనల్ కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ హైదరాబాద్ రోడ్డు మార్గంలో మనోహ టౌన్ షిఫ్ కింద ఉన్న 17 ప్లాట్లను వేలం వేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించడం జరిగిందని గుర్తుచేశారు. వచ్చే నెల 14న ప్లాట్ల వేలం వేయడం జరుగుతుందని చెప్పారు. వేలంలో పాల్గొనే వారు తాండూరు ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. వేలంలో పాల్గొనేందుకు రూ. 10 వేల చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్లాట్ల వేలంపై వచ్చేనెల 7న మరోసారి ప్రీబిడ్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని, అందులో అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వం ద్వారా ఎలాంటి లిటికేషన్లు లేని రాజీవ్ స్వగృహ ఇండ్లను పారదర్శకంగా వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు. లబ్దిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్, అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.

