అందరి సహకారంతో భద్రేశ్వర దేవాలయ అభివృద్ధి

తాండూరు రాజకీయం వికారాబాద్

అందరి సహకారంతో భద్రేశ్వర దేవాలయ అభివృద్ధి
– దేవాదాయశాఖ అనుమతులతో షాపింగ్ కాంప్లెక్స్
– ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తోడ్పాటుతో నిర్మాణ పనులు
– దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరి సహాకారంతోనే తాండూరు పట్టణం భావిగి భద్రేశ్వర దేవాలయ అభివృద్ధి జరుగుతోందని దేవాలయ రెనవేషన్ కమిటి చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్, ఈఓ శేఖర్ గౌడ్‌లు తెలిపారు. దేవాలయంలో నిర్మిస్తున్న దుకాణాల నిర్మాణాలపై వస్తున్న ఆరోపణలను వారు బుధవారం ఓ ప్రకటనలో ఖండించారు.

దేవాలయ ప్రాంగణంలోని ఇండ్లు, దుకాణాలు పూర్తిగా శిథిలావస్థలో చేరుకోవడంతో అన్నింటిని పునర్నిర్మాణం చేసేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని వీరశైవ సమాజం, యువదళ్ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని స్పష్టం చేశారు. అన్ని ప్రణాళికలు సిద్దం చేసిన తరువాతే పనుల అనుమతి గురించి దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు కోరడం జరిగిందని తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి దృష్టికి కూడా తీసుకవెళ్లి.. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి అనుమతులు పొందినట్లు తెలిపారు. ఎమ్మెల్యే సహకరించడంతో దుకాణంల నిర్మాణం ప్లాన్ ఆమోదం ఉత్తర్వులు వచ్చాయి.. మున్సిపల్ అనుమతుల గురించి కూడా ప్రతి పాదనలు పంపుట జరిగిందన్నారు.
kvcs
ముందు తరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, జాతర ఉత్సవాలు జరుపుకొనుటకు కూడా ఇబ్బందులు కలగకుండా స్థలాన్ని వదిలి పెట్టి నిర్మాణం పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ నిర్మాణాలలో వీరశైవ సమాజం పెద్దలు , యువదళ్ సభ్యులు కూడా సహకరిస్తున్నారని అన్నారు. ఇట్టి నిర్మాణం విషయం లో ఎవరికి ఎలాంటి మనస్పర్థలు లేవు.. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, అందరం కలిసి స్థానిక MLA గారి సహకారం తో మరియు పుర ప్రముఖుల సాకారం తో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. గతంలో ఉన్న కిరాయి దారులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా, దేవాదాయ శాఖ నిబందల ప్రకారం అన్ని అనుమతులు తీసుకొని పనులు చేయడం జరుగుతుందని వారు తెలిపారు.

ఇదికూడా చదవండి…

పేదల సొంతింటి కలకు తోడ్పాటు