అడ్డు.. అదుపులేని.. ఆక్రమణలు..!
– రాజీవ్, ఇందిరమ్మ కాలనీలలో పెరుగుతున్న నిర్మాణాలు
– ఏండ్లుగా నోరు మెదపని అధికారులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ శివారు రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీల్లో రోజు రోజుకు ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. గతకొన్నేళ్లుగా అక్రమణల దౌర్జన్యం కొనసాగుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రాజీవ్ కాలనీలో నిరుపేదలకు ఇండ్లను కేటాయించింది.

రాజీవ్ గృహ కల్ప, ఇందిరమ్మ కాలనీ లో కొందరు ఇండ్ల ముందు ఖాళీగా స్థలాన్ని ఆక్రమించి రోడ్డుపైనే నిర్మాణాలు చేపడుతున్నారు. అడ్డు అదుపులేకుండా అక్రమ నిర్మాణాలు జోరుగా వెలువెత్తుతున్నాయి. అడిగే నాధుడు లేక ఇస్తానురాజ్యాంగ అక్రమ కట్టడాల వ్యవహారం రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది.

కాలనీలో కొందరు ఇప్పటికే ఖాళీ స్థలాలను కబ్జా చేసుకుని నిర్మాణాలు చేసుకున్నారు. ప్రస్తుతం కొందరు ఖాళీ స్థలాలే కాకుండా డ్రైన్లను ఆనుకుని ఆక్రమణలు చేస్తున్నారు. పైన చూస్తన్న ఫోటోనే ఆక్రమణలకు ఉదహరణగా నిలుస్తోంది. ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇలాంటి అక్రమణ నిర్మాణాల జోలికి వెళితే… రాజకీయ నేతలు రంగంలోకి దిగి రాజకీయాలు చేస్తారని విమర్శలు ఉన్నాయి.

ఈ అక్రమణల వల్ల కాలనీలో ఉన్న అండర్ డ్రైనేజీ వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. కాలనీలో మురుగు సరిగ్గా పారక కంపు వెదజల్లుతోంది. దీంతో కాలనీ వాసులకు అవస్థలు తప్పడం లేదు. ఇదంతా ఆక్రమణల వల్లే జరుగుతుందని ఓ మాజీ కౌన్సిలర్ పేర్కొనడం గమనార్హం. మరి ఇప్పటికైనా అధికారులు ఆక్రమణలపై స్పందిస్తారో లేదో వేచి చూడాలి.

ఇదికూడా చదవండి…

