సూపర్ కమీషనర్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సూపర్ కమీషనర్..!
– చెత్త వాహనాలకు చికిత్స
– కార్యాలయానికి చేరుకున్న ఆటోలు, ట్రాక్టర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి సూపర్ అనిపించుకున్నారు. ఆయన ప్రత్యేక చొరవతో మరమ్మత్తులకు గురైన తాండూరు మున్సిపల్ చెత్త వాహనాలకు ఎట్టకేలకు మోక్షం కలిగింది.

కమీషనర్ యాదగిరి ప్రత్యేక దృష్టితో వినియోగంలోకి రానున్నాయి. గత కొన్ని నెలలుగా మున్సిపల్ కు సంబంధించి చెత్త తరలించే ఆటోలు, ట్రాక్టర్లు మరమ్మత్తులకు గురయ్యాయి. రెండేళ్ల పాటు మెకానిక్ షెడ్లు, రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడే వాహనాలను పట్టించుకోకుండా వదిలేశారు. తాండూరు మున్సిపల్ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టిన యాదగిరి మరమ్మత్తులకు గురైన వాహనాలపై ప్రత్యేక శ్రద్ద వహించారు.
kvcs
మూలన పడిన ఆటోలు, ట్రాక్టర్లకు మరమ్మత్తులను చేయించారు. దీంతో శనివారం తాండూరు మున్సిపల్ కార్యాలయంకు ట్రాక్టర్లు, ఆటోలు కలిపి మొత్తం 11 వాహనాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కమీషనర్ యాదగిరి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో వాహనాలకు మరమ్మత్తులు చేయించడం జరిగిందన్నారు. అవసరమున్న వార్డులలో వాహనాలను వినియోగించడం జరుగుతుందని తెలిపారు.

ఇదికూడా చదవండి…

మహిళల అభివృద్ధికి ప్రాధాన్యం