హ్యాపీ బర్త్‌డే మనోహరన్న..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హ్యాపీ బర్త్‌డే మనోహరన్న..!
– భద్రేశ్వరుని సన్నిధిలో జన్మదిన వేడుకలు
– ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు డైనమిక్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి హ్యాపీ బర్త్‌ డే శుభాకాంక్షలతో నేతలు, యువకులు ముంచెత్తారు. సోమవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలను ది గ్రేన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, వీరశైవ యువదళ్ సభ్యులు పటేల్ కిరణ్‌ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని భద్రేశ్వర దేవాలయంలో నిర్వహించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో ఆలయంలోని భద్రేశ్వరునికి పూజలు నిర్వహించారు. అనంతరం పటేల్ కిరణ్‌ కుమార్‌తో పాటు పలువురు సమాజం సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని శాలువా, పూల మాలలతో కలిసి సత్కరించారు.

మనోహర్ రెడ్డికి స్వీట్లు పంచి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి ఫోటో జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం నాయకులు లింగదలి రవికుమార్, యువదళ్‌ అధ్యక్షులు ఆడికి శషాంక్, గౌరవాధ్యక్షులుగా మఠం జదీశ్వర్, ఉపాధ్యక్షులుగా రాయల్ రవికుమార్, శివప్రసాద్, గాండ్ల పరమేష్‌, ప్రధాన కార్యదర్శిగా మద్రిక చంద్రకాంత్, కోశాధికారి కిరణ్‌ కుమార్, కార్యవర్గ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

పసుపు నీళ్లలో లాభాలు..!