బచ్‌పన్‌లో క్రిస్మస్ సందడి..!
– ఉత్సహాంగా పండగ వేడుకలు
– ఆకట్టుకున్న శాంతాక్లాజ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని బచ్‌పన్ స్కూల్లో క్రిస్మస్ సందడి నెలకొంది.

బుధవారం పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. పాఠశాల డైరెక్టర్ శ్రీలక్ష్మీ, ప్రిన్సిపల్ జ్యోతిరెడ్డిల ఆధ్వర్యంలో క్రిస్మస్ పండగ నిర్వహించారు. ఇందులో భాగంగా స్కూల్ విద్యార్థులు ఉత్సహాంగా పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకలలో భాగంగా శాంతాక్లాజ్ వేషాధారణ ఆకట్టుకుంది.

శాంతాక్లాజ్ తాత విద్యార్థులకు గిప్టులు అందించి అందరిని ఆనందపరిచారు. ఈ సందర్భంగా డైరెక్టర్ శ్రీలక్ష్మీ, ప్రిన్సిపల్ జ్యోతిరెడ్డిలు మాట్లాడుతూ క్రిస్మస్ పండగ శాంతి, ఐక్యత, ప్రేమలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. క్రిస్మస్ పండగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. అందరికి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ఇదికూడా చదవండి…

