తాండూరులో స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తా..!
– తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– బిగ్ బాష్ లీగ్–13 క్రికెట్ టోర్నీ ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణంలో క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్టేడియం నిర్మాణానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తెలిపారు.

తాండూరు పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న తాండూరు బిగ్ బాష్ లీగ్–13 క్రికెట్ టోర్నమెంట్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి టోర్నమెంట్లు దోహదపడతాయని అన్నారు.

క్రీడల పట్ల యువత ఆసక్తిని పెంపొందించడంతో పాటు ప్రతిభావంతులైన క్రీడాకారులకు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఇవి మంచి వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. తాండూరులో స్టేడియం నిర్మాణం జరిగేలా కృషి చేసి, క్రీడాకారులకు మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ చారి, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, తాండూరు మండల పార్టీ అధ్యక్షుడు వీరేందర్‌రెడ్డి, కౌన్సిలర్ యోగానంద్, నాయకులు వరాల శ్రీనివాస్‌రెడ్డి, భీమ్‌సింగ్, చెనబసప్ప, హకీమ్ ఖాన్, ఇంతియాజ్, మధుగౌడ్, చెన్నారెడ్డి, చందర్, అస్ఫాక్, టీఆర్ఎస్వీ నాయకులు వినోద్, సందీప్, టోర్నమెంట్ నిర్వాహకులు రియాన్ ఖాన్, ఆదమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.


