హస్తందే.. హావా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హస్తందే.. హావా..!
– మున్సిపల్ ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తాం
– సీఎం సభకు తాండూరు నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో హస్తం పార్టీదే హావా కొనసాగుతుందని ఆ పార్టీ నేతలు అన్నారు. శనివారం పరిగిలో జరిగే ప్రజా పాలన – ప్రగతి భాట సభకు తాండూరు నుంచి నేతలు బయల్దేరి వెళ్లారు.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 36వార్డుల నుంచి నేతలు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చేపట్టిందని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తోందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందని అన్నారు. జిల్లాలో అన్ని మున్సిపాల్టీలపై కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అభ్యర్థులు, సీనీయర్ నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

వచ్చే ఐదేళ్లలో అభివృద్ధి బాధ్యత నాదే..!