వికారాబాద్ జిల్లా కలెక్టర్ బదిలీ
– కొత్త కలెక్టర్‌గా దీపక్ తివారి నియామకం
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొత్త కలెక్టర్‌గా దీపక్ తివారి నియామకం అయ్యారు.

ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల ప్రక్రియ చేపట్టింది. ఇందులో భాగంగా 45 మంది ఐఏఎస్ అధికారులకు స్థాన చలనం కల్పించారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను నారయణపేట్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో జిల్లా కలెక్టర్‌గా ఆసిఫబాద్ జిల్లా అనదపు కలెక్టర్‌గా ఉన్న దీపక్ తివారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


