అట్టహాసంగా మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

తాండూరు రాజకీయం వికారాబాద్

అట్టహాసంగా మున్సిపల్ పాలకవర్గ ప్రమాణ స్వీకారం
– చైర్‌ పర్సన్‌గా పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి ఏకగ్రీవం
– వైస్ చైర్మన్‌గా హాట్రిక్ కౌన్సిలర్ అబ్దుల్ రజాక్
– పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
– కార్యాలయం వద్ద పోలీసుల బందోబస్తు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో డీఆర్ఓ మంగీలాల్, మున్సిపల్ కమీషనర్ మధుసూధన్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారంకు ఏర్పాట్లు చేశారు.

ప్రమాణ స్వీకారోత్సవంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఎక్స్‌అఫిసియో హోదాలో పాల్గొన్నారు. పట్టణంలోని 36వ వార్డులకు గాను ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నుంచి 19 మంది కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నుంచి 12 మంది, బీజేపీ నుంచి ముగ్గురు, ఎంఐఎం 1, ఇండిపెండెంట్ 1 చొప్పున ప్రమాణ స్వీకారంకు హాజరయ్యారు. ముందుగా అందరిచేత కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీ కొండా సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పి వెళ్లిపోయారు. అనంతరం బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం తరువాత చైర్ పర్సన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక జరిగింది.

ఏకగ్రీవంగా చైర్ పర్సన్ ఎన్నిక
తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్‌గా పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా అబ్దుల్ రజాక్ కూడా ఎన్నికయ్యారు. 12వ వార్డు నుంచి పట్లోళ్ల నీరజా బాల్‌ రెడ్డి, 29వ వార్డు నుంచి అబ్దుల్ రజాక్ కౌన్సిలర్లుగా ఎన్నికైన విషయం విధితమే చైర్ పర్సన్ గా నీరజను కౌన్సిలర్ అబ్దుల్ రజాక్ ప్రతిపాదించగా, 22వ వార్డ్ కౌన్సిలర్ మనపురం రామకృష్ణ బలపరిచారు. వైస్ ఛైర్పసన్ గా అబ్దుల్ రజాక్ ను వేణు గోపాల్ ప్రతిపాదించగ జుంటిపల్లి వెంకటేష్ బలపరిచారు.

పట్టణ అభివృద్ధికి కృషి చేయండి : ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
తాండూరు మున్సిపల్ పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ అధిరోహించడం పట్ల ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ప్రమాణ స్వీకారం తరువాత చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధికీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ సమన్వయంతో పని చేసి పట్టణ అభివృద్ధి సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. పార్టీలకతీతంగా పాలన చేపట్టిన మున్సిపల్ కీర్తిప్రతిష్టలు పెంచాలని సూచించార. తాండూరు పట్టణ అభివృద్ధికి ఎల్లప్పడు సహాకారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నరేంద్ రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక బాయికాట్‌..!