ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గా మిట్టి శ్రీనివాస్

తాండూరు రాజకీయం వికారాబాద్

ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గా మిట్టి శ్రీనివాస్
– జిల్లా అధ్య‌క్ష, ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శుల‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : వికారాబాద్ జిల్లాలోని ఓబీసీల హ‌క్కుల సాధ‌న‌కు త‌న‌వంతు కృషి చేస్తాన‌ని బీజేపీ ఓబీసీ మోర్చా వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మిట్టి శ్రీనివాస్ అన్నారు. బుధ‌వారం ఆయ‌న ఓబీసీ మోర్చ వికారాబాద్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా నియామ‌కం అయ్యారు. ఈ సంద‌ర్భంగా మిట్టి శ్రీ‌నివాస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి ,మరియు జిల్లా ప్రధాన కార్యాదర్శి యు. రమేష్ కుమార్‌ల‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. దేశ ప్ర‌ధాని మోడి పాల‌న‌లో ఓబీసీల‌కు సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. తెలంగాణాలో 52 శాతంఉన్న బీసీలకి రాజకీయ, విద్య వైద్య పారిశ్రామిక రంగాల్లో న్యాయం జరగటం లేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశాల మేరకు జిల్లాలో ఓబీసీల హక్కుల సాధన‌కు త‌న వంతు కృషి చేస్తాన‌ని పేర్కొన్నారు.