సీఎం కప్ స్టేట్ లెవల్‌కు విశ్వవేద విద్యార్థులు
– పలు విభాగాలలో ఏడుగురి ఎంపిక
– హర్షం వ్యక్తం చేసిన స్కూల్ యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలకు తాండూరు విశ్వవేద పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు.

ఇప్పటికే ఈ పాఠశాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటగా.. తాజాగా పలు విభాగాలలో ఏకంగా ఏడుగురు స్టేట్ లెవల్ పోటీలలో పాల్గొనబోతున్నారు. వాలీబాల్ విభాగంలో జి. శ్రీధర్, కరాటే విభాగంలో బి. వేణు, స్కేటింగ్ విభాగంలో ఎం. అద్విత్, ఎం. శివరుద్రు, డి. వైష్ణవి, ఎం. సంజన, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్‌లలో జి.శ్రీధర్‌లు ఎంపికయ్యారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జీ.వెంకటేష్, కరస్పాండెంట్ జీ. గణేష్ కుమార్, డైరెక్టర్ పి.సుజాత, పీఈటీలు మురళీ మోహన్, ఆనంద్‌లు హర్షం వ్యక్తం చేశారు. చదువుతో పాటు క్రీడల్లో తమ విద్యార్థులు సత్తా చాటడం విశ్వవేద స్కూల్‌కే గర్వకారణమని అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలలో కూడా విద్యార్థులు మెరవాలని ఆకాంక్షించారు.


