అంతారం తాండా సర్పంచుకు ఎమ్మెల్యే పరామర్శ
– రాంచందర్ నివాసానికి వెళ్లిన మనోహర్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండా సర్పంచ్ రాంచందర్ నాయక్ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల రాంచందర్ నాయక్ తల్లీ మృతి చెందింది.

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అంతారం తాండాలోని రాంచందర్ నాయక్ ఇంటికి వెళ్లారు. ఆయన తల్లి చిత్రపటానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం రాంచందర్ నాయక్ను పరామర్శించి మనోధైర్యం చెప్పారు.

ఎమ్మెల్యే వెంట డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, యువ నాయకులు గోవింద్, రాజు, దాస్, రాము, గోపాల్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

