సర్కారు సంక్షేమ బడ్జెట్ ఆదర్శం
– సంక్షేమం, కార్మిక రంగానికి నిధుల కేటాయింపు హర్షణీయం
– బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు, న్యాయవాది గోపాల్
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఉద్యోగులు, కార్మికులు, సంక్షేమ రంగానికి ప్రాధాన్యమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఆదర్శనీయమని బీఆర్ఎస్ తాండూరు, కార్మిక విభాగం అధ్యక్షులు, న్యాయవాది కె. గోపాల్ అన్నారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. 2022-23 వార్షిక బడ్జెట్లో రూ.2,30,396 కోట్లతో ప్రవేశ పెట్టగా అందులో 70 శాతం నిధులు సంక్షేమ రంగానికి కేటాయించడం హర్షణీయమన్నారు. 80 వేల మంది ఉద్యోగులను రెగ్యులర్ ప్రాతిపదికన 11 వేల మంది ఉద్యోగులను రెగ్యులర్ చేయడానికి రూ. 1 వెయ్యి కోట్లు చేసి ఇచ్చిన మాటకు కట్టుబడిందన్నారు. పేదల ఇంటి నిర్మాణానికి రూ. 7980 కోట్లు, రుణమాఫీకి రూ.7500 కోట్లు, వేతనాలకు చెల్లింపులకు వేల కోట్లు కేటాయించడం ఆదర్శనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని’ విధంగా సంక్షేమ పాలన అందిస్తూ ఆదర్శంగా నిలుస్తోందన్నారు.

