మంత్రి భట్టి విక్రమార్కను కలిసిన అఫ్పూ(నయూం)

తాండూరు రాజకీయం వికారాబాద్

మంత్రి భట్టి విక్రమార్కను కలిసిన అఫ్పూ(నయూం)
– తాండూరు అభివృద్ధికి తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి
– ఎమ్మెల్యే నాయకత్వాన్ని బలపరిచేందుకు కృషి చేస్తామని హామి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను తాండూరుకు చెందిన కాంగ్రెస్ సీనీయర్ నాయకులు అఫ్పూ(నయూం) మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఆయనకు శాలువతో సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తాండూరులో జరుగుతున్న అభివృద్ధిని మంత్రి భట్టి విక్రమార్క దృష్టికి అఫ్పూ(నయూం) తీసుకెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు నియోజకవర్గ అభివృద్ధికై నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు.

గ్రామాలతో పాటు పట్టణాలలో అభివృద్ధి పనులు పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మీ తోడ్పాటుతో తాండూరును ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. అదేవిధంగా తాండూరులో పెండింగ్‌ పనులు, అభివృద్ధి పనుల పూర్తికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు తాండూరులో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేసే బాధ్యత మాదే అని మంత్రికి వివరించారు.

కేటీఆర్‌ గురించి మాట్లాడే స్థాయి మీది కాదు