శరణు బసప్ప సేవలకు దక్కిన గౌరవం

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

శరణు బసప్ప సేవలకు దక్కిన గౌరవం
– లయన్స్‌ క్లబ్‌ నుంచి జిల్లా యశోత్సవ్ అవార్డు
– జిల్లా గవర్నర్ చేతుల మీదుగా ప్రధానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు లయన్స్ క్లబ్ తాజా మాజీ అధ్యక్షులు శరణు బసప్ప అందించిన సేవలకు గౌరవం దక్కింది.

లయన్స్ క్లబ్ ద్వారా ఆయన జిల్లా యశోత్సవ్ అవార్డును అందుకున్నారు. 2025-26 గాను జిల్లా గవర్నర్ డాక్టర్ జి. మహేంద్ర కుమార్ రెడ్డి చేతుల మీదుగా శరణు బసప్ప ఈ అవార్డును అందుకున్నారు. తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఆర్. శరణు బసప్ప ఆద్వర్యంలో జిల్లా స్థాయిలో వివిధ రకాలైన సేవలు అందించారు.

లయన్స్ క్లబ్ తరుపున తాండూరు నియోజకవర్గం వ్యాప్తంగా ఉచిత వైద్య శిబిరాలు, విద్యార్థులకు, వృద్ధులకు, పేదలకు పలు రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్తమ ఆల్బమ్, కంటి వైద్య శిబిరం(ఐ క్యాంపు), అన్న ప్రసాదం, పర్యావరణం, క్లబ్ లో సభ్యుల చేరికలకు గాను 2025–26 సంవత్సరానికి సంబంధించిన జిల్లా యశోత్సవ్ అవార్డును ఆర్. శరణు బసప్పకు అందజేశారు. దీంతోపాటు ఆయా రంగాలలో అందించిన సేవలతో తాండూరు లయన్స్ క్లబ్ కి ఏడు ఉత్తమ అవార్డులు వరించాయి.

యశోత్సవ్ అవార్డును జిల్లా గవర్నర్ డా.జి.మహేంద్ర కుమార్ చేతుల మీదుగా శరణు బసప్పకు  అందజేశారు. అదేవిదంగా లెఫ్టినెంట్ సల్లా దామోదర్‌కు అంతర్జాతీయ ప్రశంసా పత్రంతో పాటు యశోత్సవ్ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా శరణు బసప్ప తనకు యశోత్సవ్ అవార్డు దక్కడం చాలా సంతోష కరమని అన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. తమకు సహకారం అందించిన కార్యదర్శి మంకల్ నటరాజ్, ట్రెజరర్ బి.గౌరీ శంకర్, లయన్స్ క్లబ్ సభ్యులకు ఈ సందర్బంగా ధన్యవాదములు తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో పి డి జి రమేష్ చంద్ర పండిత్, వై బసనప్ప, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సాధనలో ఆచార్య ఆశయాలు చిరస్మరణీయం