స్కూళ్లకు కొత్త రూల్..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

స్కూళ్లకు కొత్త రూల్..!
– ఫీజుల వివరాలను తప్పక ప్రదర్శించాలి
– తెలంగాణ విద్యాశాఖ కీలక ఆదేశాలు
– నిబంధనలు ఉల్లంఘిస్తే జరిగిదిదే..
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : రాష్ట్రంలోని ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యార్థుల ఫీజుల వివరాలను తప్పనిసరిగా బహిరంగంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల నిర్మాణాన్ని (ఫీజు స్ట్రక్చర్) ప్రతి పాఠశాల నోటీసు బోర్డుపై, అధికారిక వెబ్‌సైట్‌లో, అలాగే పాఠశాల విద్యాశాఖ పోర్టల్‌లో స్పష్టంగా పొందుపరచాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫీజుల వివరాలను వెల్లడించడంలో పారదర్శకత పాటించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలను అమలు చేయని పాఠశాలలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. అలాగే, 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజుల వివరాలను ప్రదర్శించని పాఠశాలలపై నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా విద్యాశాఖ అధికారులకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజుల విషయంలో పూర్తి సమాచారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, అన్ని ప్రైవేటు విద్యాసంస్థలు ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని విద్యాశాఖ సూచించింది.

క్వాలిటీ లెస్‌గా సీసీ రోడ్డు..!