బాప్‌రే.. బప్పా.. లడ్డూకి ఇంత క్రేజా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బాప్‌రే.. బప్పా.. లడ్డూకి ఇంత క్రేజా..!
– ఐదో సారి రికార్డు బ్రేక్ చేసిన మంచాల ఫ్యామిలి
– రూ. 5,11,111ల మ్యాజిక్‌ ఫిగర్‌తో లడ్డూ సొంతం
– తాండూరులో ఇదే అత్యధిక వేలం ధర
– భారీగా వేలం అయిన లడ్డుల లిస్టు ఇదే
తాండూరు, దర్శిని ప్రతినిధి : బాప్‌రే.. గణపతి బప్పా లడ్డూకు ఇంత క్రేజ్ ఉంటుందని మరోసారి తాండూరు భక్తులు నిరూపించారు. శుక్రవారి వినాయక నిమజ్జనం సందర్భంగా తాండూరులో వినాయకుని లడ్డూకు భలే డిమాండ్ లభించింది.

చివరి రోజు నిర్వహించిన లడ్డూ వేలంలోరికార్డు ధరకు వేలం జరిగింది. తాండూరు పట్టణంలోని పటేల్ భగీచాలోని గణేష్‌ లడ్డూ రికార్డులు బ్రేక్ చేసే రేటుకు హరాజ్ అయ్యింది. పట్టణంకు చెందిన మంచాల కుటుంబ సభ్యులు అధిక ధరకు వేలం పాడి దక్కించుకున్నారు.

మంచాల భాను రేఖ, అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు రూ. 5లక్షల 11వేల 111లకు గణేష్‌ లడ్డూను దక్కించుకున్నారు. ఇది వారు వరుసగా ఐదో సారి మ్యాజిక్ ఫిగర్‌తో లడ్డూను సొంతం చేసుకోవడం విశేషం. గత యేడాది యూడాది కూడా వీరు రూ. 4లక్షల 55వేల 555లకు గణేష్‌ లడ్డూను దక్కించుకున్నారు.

అదేవిధంగా బాలాజీ మందిర్‌లో ప్రతిష్టించిన వినాయకుని లడ్డూను నందకిషోర్‌ పర్తాని రూ. 2లక్షల 71వేలకు సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ప్రతిష్టించిన గణేషుని లడ్డూను డీసీసీబీ జిల్లా మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ దక్కించుకున్నారు. శాంతినగర్‌లో భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ రూ. 75వేలుకు సొంతం చేసుకున్నారు.

వరసిద్ది వినాయకుని వద్ద ఉపాధ్యాయుడు నర్సిరెడ్డి వినాయకుని లడ్డూను రూ. 1లక్ష 25వేలకు వేలం పాడారు. పట్టణంలోని శివాజీ చౌక్ గణేష్‌ ఉత్సవ సమితి లడ్డూను స్వాగత్ హోటల్‌ నిత్‌ రూ. 2లక్షల 2వేల 26లకు దక్కించుకున్నారు. గత యేడాది కంటే ఈసారి లడ్డూల వేలం రికార్డులు సృష్టించింది.

ఎమ్మెల్యేకు ‘గణ’మైన కానుక..!