కాలనీలకు ప్రత్యేక పేర్లు..! 

తాండూరు రాజకీయం వికారాబాద్

కాలనీలకు ప్రత్యేక పేర్లు..! 
– 7వ వార్డు కౌన్సిలర్ ఈర్షద్ కృషి
– కౌన్సిల్‌లో అంశానికి ఆమోదం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం వార్డు నంబర్‌ 7 పరిధిలోని నాలుగు ప్రాంతాలకు ప్రత్యేక పేర్లు పెట్టబోతున్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఈర్షద్ స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. తాజాగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆ హామీని కార్యరూపంలోకి తీసుకొచ్చే దిశగా నాలుగు పేర్లను ప్రతిపాదిస్తూ తీర్మానం చేశారు.

ఈ మేరకు వార్డులోని పలు ప్రాంతాలకు 1. హుస్సేన్ నగర్, 2. కోకిల కాటేజ్, 3. సుప్రీం కాలనీ, 4. విలేమూన్ చౌరస్తాలుగా పేర్లు పెట్టేందుకు తీర్మానం చేశారు.

ఈర్షాద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని గుర్తుపెట్టుకుని స్థానికుల ఆకాంక్షను కౌన్సిల్‌ తీర్మానం ద్వారా ముందుకు తీసుకెళ్లడం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈర్షద్ మాట్లాడుతూ.. కాలనీ అభివృద్ధి, ఇచ్చిన హామీలకు కట్టుబడి పనిచేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

నాలుగు ప్రాంతాలకు ప్రతిపాదించిన పేర్లు:
ఓల్డ్ ఎలక్ట్రికల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రాంతం — హుస్సేన్ నగర్
గంగోత్రి హోటల్ ఎదురుగా ఉన్న ప్రాంతం — కోకిల కాటేజ్
విలియం మూన్ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్డుకు — విలియంమూన్ చౌరస్తా
రాయల్ కాంతి ప్రాంతం — సుప్రీం కాలనీ

హామీలతో ప్రజలను మోసం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే