మంత్రి మహేందర్ రెడ్డిని కలిసిన వీఎన్ గౌడ్

తాండూరు రాజకీయం వికారాబాద్

మంత్రి మహేందర్ రెడ్డిని కలిసిన వీఎన్ గౌడ్
– సన్మానించి.. శుభాకాంక్షలు చెప్పిన నేత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర సమాచార, గనుల భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డిని తాండూరు మున్సిపల్ మాజీ చైర్మన్ ఎ.విశ్వనాథ్ గౌడ్ (వీఎన్ గౌడ్) కలిశారు. రాష్ట్ర మంత్రిగా మహేందర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లోని నివాసంలో ఆయనను విశ్వనాథ్ గౌడ్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. తెలంగాణ రాష్ట్రంలో మహేందర్ రెడ్డి రెండో సారి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని మహేందర్ రెడ్డిని వీఎన్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో వీఎన్ గౌడ్ కుమారుడు, కృష్ణగౌడ్, మల్ రెడ్డిపల్లి సుభాన్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!