మీ బస్సు ఎక్కడుందో తెలుసుకోవడం ఈజీ..!

టెక్నాలజీ తాండూరు రాజకీయం వికారాబాద్

మీ బస్సు ఎక్కడుందో తెలుసుకోవడం ఈజీ..!
– కొత్త వ్యవస్థకు తాండూరు ఆర్టీసీ శ్రీకారం
– ప్రయాణికుల కోసం ప్రత్యేక ఎంక్వయిరీ నంబర్‌
– ప్రకటించిన డీఎం ప్రవీణ్‌కుమార్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్టీసీ ప్రయాణికులకు బస్సుల సమాచారం ఇక మరింత సులభంగా అందనుంది. గమ్యస్థానానికి వెళ్లే బస్సు ఎప్పుడు వస్తుంది..? ఏ సమయానికి బయలుదేరుతుంది..? వంటి వివరాలను తెలుసుకునేందుకు ప్రత్యేక ఎంక్వయిరీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డిపో మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు.

తాండూరు ఆర్టీసీ బస్టాండ్‌లో 9063469572 నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి తమ గమ్యస్థానానికి సంబంధించిన బస్సుల రాకపోకలు, సమయాలు తదితర వివరాలను తెలుసుకోవచ్చన్నారు. అత్యవసర సమయాల్లోనూ ఈ సేవ ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు.

ప్రయాణికులు బస్టాండ్‌కు వచ్చి బస్సుల కోసం ఆరా తీయాల్సిన అవసరం లేకుండా ఫోన్‌ ద్వారానే సమాచారం పొందేలా ఈ సదుపాయాన్ని కల్పించినట్లు డీఎం పేర్కొన్నారు. ఆర్టీసీ అందిస్తున్న ఈ సేవను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అట్టహాసంగా తాండూరు ప్రైవేట్‌ పాఠశాలల సంఘం ప్రమాణ స్వీకారం