తండ్రి జయంతిలో పేదలకు సేవ
– ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ ద్వారా నిత్యవసర సరుకుల పంపిణీ
– అందజేసిన చైర్మన్ రొంపల్లి సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తన తండ్రి జన్మదినం సందర్భంగా ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ చైర్మన్ రొంపల్లి సంతోష్ కుమార్ పేదలకు సేవ కార్యక్రమంతో చేయూతను అందించారు.

శుక్రవారం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో తండ్రి కీ.శే. రొంపల్లి కిష్టయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద కుటుంబాలను గుర్తించి వారికి నిత్యావసర సరుకులను అందజేశారు.

ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ తండ్రి జ్ఞాపకార్థం పేదలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ తరుపున పేదలకు సేవా కార్యక్రమాలు చేపడుతామని, సేవలో సంతృప్తి కలుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో మల్కాపూర్ మాజీ ఎంపీటీసీ రఘునాథ్ రెడ్డి, జినుగుర్తి సర్పంచ్ శరణ్, ఆర్‌ఎస్‌కే ఫౌండేషన్ సభ్యులు అగీరు మహేష్, సోము, సత్య, గురు, నరేష్, తర్లపల్లి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.


