దయచూపు దుర్గమ్మ తల్లీ..!
– మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి
– అమ్మవారికి చైర్ పర్సన్ దంపతుల పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని చైర్‌పర్సన్ ఆకాంక్షించారు.

ఆదివారం చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ పట్లోళ్ల బాల్‌రెడ్డి దంపతులు సాయిపూర్ వినాయకుని ఆలయంలో కొలువైన దుర్గామాతను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ దుర్గామాత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు.

ప్రజల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని, అందరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు లభించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలు శరన్నవ రాత్రుల ఉత్సవాలు భక్తిశ్రద్దలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.


