రేపు తాండూరు, పెద్దేముల్ మండ‌లంలో విద్యుత్ అంత‌రాయం 

తాండూరు వికారాబాద్

రేపు తాండూరు, పెద్దేముల్ మండ‌లంలో విద్యుత్ అంత‌రాయం 
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలోని తాండూరు, పెద్దేముల్ మండ‌లంలో రేపు విద్యుత్ అంత‌రాయం విధిస్తున్న‌ట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు తాండూరు మండలంలోని కరన్‌కోట్, గౌతాపూర్‌తో పాటు పెద్దేముల్ మండ‌లం, కోట్‌పల్లి విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండ‌ద‌ని చెప్పారు. ఆయా స‌బ్ స్టేష‌న్‌ల ప‌రిధిలో 33 కేవి ఫీడ‌ర్ల‌లో కెపాసిట‌ర్‌బ్యాంకు ఐసోలేట‌ర్ల తొల‌గింపు, విద్యుత్ లైన్‌ల క్లియరెన్స్ ఏర్పాటు చేయడానికి విద్యుత్ అంత‌రాయం విధిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. కావున ప్ర‌జ‌లు ఈ అసౌక‌ర్యానికి స‌హ‌క‌రించాల‌ని విద్యుత్ డీఈ వై. వెంకన్న విజ్ఞ‌ప్తి చేశారు.