జిల్లాల ఏర్పాటు కేసీఆర్‌ దూరదృష్టికి నిదర్శనం

తాండూరు రాజకీయం వికారాబాద్

జిల్లాల ఏర్పాటు కేసీఆర్‌ దూరదృష్టికి నిదర్శనం
– బీఆర్‌ఎస్‌ తాండూరు నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీశైల్‌రెడ్డి
– వికారాబాద్‌లో కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం
– పైలట్‌ పిలుపుతో తరలివెళ్లిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం కేసీఆర్‌ దూరదృష్టికి నిదర్శనమని తాండూరు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి శ్రీశైల్‌రెడ్డి అన్నారు.

కొత్త జిల్లాల ఏర్పాటు జరిగి పదేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం వికారాబాద్‌లోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో కేసీఆర్‌ చిత్రపటానికి మాజీ మంత్రి, చేవెళ్ల ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డితో కలిసి క్షీరాభిషేకం చేశారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీశైల్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన ప్రజలకు చేరువైందని, ప్రభుత్వ సేవలు పొందేందుకు ప్రజలకు సౌలభ్యం కలిగిందని పేర్కొన్నారు. తెలంగాణ సాధనతోపాటు రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.

జిల్లాల ఏర్పాటు దశాబ్దం పూర్తయిన సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారీ, నరుకుల నరేందర్ గౌడ్, నియోజకవర్గంలోని వివిధ మండలాల బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, కార్యదర్శులు, కౌన్సిలర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

స్టేషన్‌ హనుమాన్‌ ఆలయానికి నోటిఫికేషన్‌!