ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు..!
– మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు
– మైనార్టీ నేతలతో సమావేశమైన రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 25న తాండూరు ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. మంగళవారం తాండూరుకు వచ్చిన రోహిత్ రెడ్డి మైనార్టీ నేతలతో సమావేశం అయ్యారు. రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ సోదరులకు ఈనెల 25న ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు తెలిపారు.

పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ లో భారీ ఎత్తున విందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇఫ్తార్ విందుకు మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, మాజీ కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, ముక్తార్, మైనార్టీ సెల్ అధ్యక్షులు యూనుస్, ఈర్షాద్, ఇంతియాజ్ బాబా తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

