బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ!

తాండూరు రాజకీయం వికారాబాద్

బాధిత కుటుంబానికి కంజర్ల ఫౌండేషన్‌ అండ!
– అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన కుటుంబానికి సాయం
– నిత్యావసర వస్తువులు అందజేసి మానవత్వం చాటుకున్న సభ్యులు
యాలాల, దర్శిని ప్రతినిధి : అగ్నిప్రమాదంతో కట్టుకున్న ఇల్లు, ఇంట్లోని వస్తువులు కోల్పోయి కష్టాల్లో ఉన్న కుమ్మరి బుచ్చమ్మ కుటుంబానికి కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్‌ అండగా నిలిచింది.

యాలాల మండలం రాస్నం గ్రామంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో బుచ్చమ్మ ఇల్లు దగ్ధమై సుమారు రూ.50 వేల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. కష్టపడి దాచుకున్న నగదు సహా ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోవడంతో ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడింది. విషయం తెలుసుకున్న ఫౌండేషన్‌ సభ్యులు వెంటనే స్పందించి రాస్నం గ్రామానికి చేరుకున్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించి, నిత్యావసర వస్తువులు అందజేశారు. కష్టకాలంలో అండగా నిలిచి కుటుంబానికి ధైర్యం చెప్పారు.

ఈ సందర్భంగా ఫౌండేషన్‌ ప్రతినిధి, మాజీ జిల్లా కోఆప్షన్‌ సభ్యుడు అక్బర్‌ బాబా, ప్రకాశ్‌గౌడ్‌ మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తమ ఫౌండేషన్‌ ముందుంటుందని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ యువకులు బాబు, మధుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Pvr

పోట్లీ మహారాజ్‌ ఆలయానికి పునర్నిర్మాణ శోభ..!