ముదురుతున్న ఫ్లెక్సీ వివాదం..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

ముదురుతున్న ఫ్లెక్సీ వివాదం..!
– జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన యువసేన సభ్యులు
– పాత ఫిర్యాదు విచారణపై కోర్టు అనుమతి కోరిన పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ జన్మదినం సందర్భంగా తాండూరులో పెట్టిన ఫ్లెక్సీల ధ్వంసం రాజకీయ వివాదంగా మారింది. కావాలనే చింపేసిన గుర్తుతెలియని వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పట్టణ స్థాయితో పాటు జిల్లా స్థాయి వరకు ఫిర్యాదులు వెళ్లాయి. రోజు రోజుకు వివాదం ముదురుతోంది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 27న తాండూరులో తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్ మెంబర్ శుభప్రద్ పటేల్ జన్మదినం సందర్బంగా అంతకు ముందు రోజు రాత్రి తాండూరు పట్టణంతో పాటు బషీరాబాద్‌ మండలంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. రాత్రి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మరుసటి రోజు ఉదయం వరకు గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారు. ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటనపై శుభప్రద్‌ పటేల్ యువసేన సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు.

అదే రోజు తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. తాజాగా శనివారం వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డిని శుభప్రద్ పటేల్ యువసే సభ్యులు కలిసి మరోసారి ఫిర్యాదు చేశారు. నిందితులను త్వరగా గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో శుభ ప్రద్ యవసేన అధ్యక్షుడు భాను ప్రసాద్, సభ్యులు కుర్వ బాలు, రాము గౌడ్, విజయ్, నరేశ్ గౌడ్, చందు, సచిన్, శ్రీశైలం తదితరులు ఉన్నారు. మరోవైపు తాండూరు పట్టణ పోలీస్టేషన్‌తో పాటు బషీరాబాద్‌ మండల పోలీస్టేషన్‌లో యువసేన సభ్యులు చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టేందుకు కోర్టు అనుమతిని కోరినట్లు తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సంఘటన కూడా తాండూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఫెక్లీ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో అని పలువురు గుసగుసలాడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి…

తాండూరు మున్సిపల్‌కు మహర్థశ

chaithany collage