
బస్సు కష్టాలు చెప్పుకోండి..!
– రేపు తాండూరు డిపో పరిధిలో ‘డయల్ యువర్ డీఎం’
– డిపో మేనేజర్ ప్రవీణ్‌కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బస్సు ప్రయాణాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయా? బస్సు సర్వీసులకు సంబంధించిన సమస్యలున్నాయా? అయితే ప్రయాణికులు నేరుగా డిపో మేనేజర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చు.

తాండూరు డిపో పరిధిలో బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ప్రయాణికులు తమ సమస్యలు, సూచనలను 9063469572 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.

బస్సు సర్వీసులు, ప్రయాణ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకురావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


