ముత్తడి దూకిన జుంటుపల్లి వాగు
– అలుగుపై నుంచి పారుతున్న వరధనీరు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు నియోజకవర్గం యాలాల మండలంలోని ప్రసిద్ద జుంటుపల్లి ప్రాజెక్టు ఉరకలు వేస్తోంది. శుక్రవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో ఆదివారం ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరధనీరు చేరుతోంది. ప్రాజెక్టు అలుగుపై నుంచి వరధ నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరధ ఉధృతితో క్రమంగా నీటిమట్టం పెరుగుతోంది. ప్రాజెక్టు నిండుగా ముత్తడిదూకి ప్రవహిస్తుండడంతో చూపరులను ఆకట్టుకోంది.
ఇదికూడా చదవండి…

