దుర్గమ్మ సేవలో చైర్పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి
– సాయిపూర్ లో అమ్మవారికి ప్రత్యేక పూజల.
– అనంతరం భక్తులకు అన్నదానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆధ్యాత్మిక భక్తితో పాటు సేవాభావాన్ని చాటుతూ తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి దుర్గమ్మ సేవలో పాల్గొన్నారు.

సాయిపూర్ బోనమ్మ గుడి వద్ద దుర్గామాతకు నీరజా బాల్ రెడ్డి, పట్లోళ్ల బాల్ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.

దుర్గామాత పూజల అనంతరం చైర్పర్సన్ ఆధ్వర్యంలో భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదం అందించి సేవాభావాన్ని చాటారు. దైవచింతనతో పాటు అన్నదానం వంటి సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కల్పించారు.

సాయిపూర్ బోనమ్మ గుడి వద్ద భక్తిశ్రద్ధలతో సాగిన పూజా కార్యక్రమం, అన్నదానంలో భక్తులు పాల్గొని దుర్గామాత ఆశీస్సులు పొందారు. చైర్పర్సన్ నీరజా బాల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తిమయ వాతావరణాన్ని నింపింది.


