పట్నం వర్గం నేతల ఇంటికి పైలెట్..!
– పార్టీ నేతలతో ముచ్చటించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని పిలుపు
– తాండూరులో ఉత్సహాంగా పైలెట్ ఆత్మీయ పలకరింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి వర్గీయుల ఇంటికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వెళ్లారు. ఇన్నాళ్ల వర్గాలను పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేద్దామని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెలెట్ ఆత్మీయ పలకరింపు కార్యక్రమం తాండూరు పట్టణంలో చేపట్టారు.
మంగళవారం తాండూరు పట్టణంలో పైలెట్ ఆత్మీయ పలకరింపు ఉత్సహాంగా కొనసాగింది. తాండూరు పట్టణంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మంత్రి మహేందర్ రెడ్డి వర్గీయులతో పలకరింపు ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పట్లోళ్ల సాయిపూర్ బాల్ రెడ్డి, సీనియర్ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, బంటు మల్లప్ప, మాజీ కౌన్సిలర్లు పరిమళ, అనురాధ, జుబేర్ లాల, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అగ్గనూర్ జగదీశ్వర్, తంబాకు చంద్రశేఖర్, తదితర ప్రముఖులతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆత్మీయ పలకరింపు ద్వారా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరులో మంత్రి, తాను కలిసి పార్టీ. కోసం పనిచేయడం జరుగుతుందన్నారు. ఇప్పుడు అందరం కలిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. నేతలు, కార్యకర్తలందరికీ సమన్యాయం జరిగేలా కృషి చేస్తామన్నారు. కావున నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలన్నారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

