కాళికాదేవి సన్నిధిలో చైర్పర్సన్ నీరజా బాల్రెడ్డి
– నవరాత్రి వేడుకల్లో ప్రత్యేక పూజలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తాండూరు పట్టణంలోని కాళికాదేవి ఆలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నీరజా బాల్రెడ్డి మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు దైవభక్తికి, ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకలని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ప్రజల జీవితాల్లో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించినట్లు తెలిపారు.

నవరాత్రి ఉత్సవాలను ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని, ఆధ్యాత్మిక భావనతో పాటు ఐకమత్యం, సోదరభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు.

నవరాత్రుల సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.


