తాండూరు జానపద కళాకారునికి ఐకాన్ అవార్డు

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

తాండూరు జానపద కళాకారునికి ఐకాన్ అవార్డు
– సినీ హిరో సుమ‌న్ చేతుల మీదుగా అంద‌జేత
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరుకు చెందిన జాన‌ప‌ద కళాకారుడు ఎల్. అశోక్‌కు సాయి అలేఖ్య ఐకాన్ అవార్డు వ‌రించింది. తెలంగాణ భాష సాంసృతిక శాఖ మ‌రియు సాయి అలేఖ్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో తాండూరుకు చెందిన జానపద కళాకారుడు అశోక్ అవార్డును అందుకున్నారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన సినిమా హీరో సుమన్ చేతులమీదుగా అశోక్‌కు అందించారు. ఈ సంద‌ర్భంగా క‌ళాకారుడు అశోక్ మాట్లాడుతూ త‌న‌ను ఈ అవార్డుకు ఎంపిక చేసిన సంస్థ ప్రతినిధులు అరుణకు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవి ఉపసకులు, శ్రీ‌ దైవజ్ఞ శర్మలు డాన్స్ మాస్టర్ అశోక్ కి ఆశీస్సులు అందించారు.