హిందూ ఉత్సవ సమితికి భారీవిరాళం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

హిందూ ఉత్సవ సమితికి భారీవిరాళం..!
– రూ. 2.50లక్షలు అందజేసిన పట్నం రినీష్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రినీష్ రెడ్డి తాండూరు హిందూ ఉత్సవ సమితికి భారీ విరాళం అందజేశారు. ఆదివారం తాండూరు పట్టణానికి వచ్చిన రినీష్ రెడ్డి ఎమ్మెల్సీ నివాసంలో తాండూరు హిందూ ఉత్సవ సమితి సభ్యులతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తరుపున వినాయక చవితి సందర్భంగా హిందూ ఉత్సవ సమితికి తన వంతు సాయంగా రూ. 2లక్షల 50వేల విరాళం అందజేశారు.

దాదాపు పట్టణంలోని ప్రతి వినాయకుని మండపాలకు రూ. 5వేలు అందజేశారు. ఈ సందర్భంగా రినీష్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి పండగను సంతోషంగా జరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు, మాజీ కౌన్సిలర్లు పరిమళ, అబ్దుల్ ఖవి, సమితి ఉపాధ్యక్షులు బిడ్కర్ రఘు, శ్రీకాంత్ రెడ్డి, కోశాధికారి తర్లపల్లి భానుకుమార్, సభ్యులు అశోక్ కుమార్, కుమార్, నరేష్, రజక నర్సింహా తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

గణనాథుల సేవలో పట్నం యువనేత