తాటికొండ తలపులో..!
– ఘనంగా స్వర్గీయ కవిత 50వ జన్మదినం
– పేదలకు అన్నదానం చేసిన మాజీ చైర్పర్సన్ స్వప్న పరిమల్
తాండూరు, దర్శిని ప్రతినిధి: స్వర్గీయ తాటికొండ కవిత 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

బుధవారం పట్టణంలోని మర్రిచెట్టు రక్తమైసమ్మ దేవాలయం వద్ద పేదలకు భోజనం పంపిణీ చేశారు. 2015లో మృతి చెందిన కవిత జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా స్వప్న పరిమల్ గుప్తా మాట్లాడుతూ..తాటికొండ కవిత జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు.

ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, ఆప్తులు, దేవాలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


