ఘ‌నంగా టీపీసీసీ ఉపాధ్య‌క్షులు ర‌మేష్ మ‌హారాజ్ జ‌న్మ‌దిన వేడుకలు

తాండూరు రాజకీయం వికారాబాద్

ఘ‌నంగా టీపీసీసీ ఉపాధ్య‌క్షులు ర‌మేష్ మ‌హారాజ్ జ‌న్మ‌దిన వేడుకలు
– యూత్ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిబిరం
– ముదిరాజ్, బీసీ సంఘం ఆధ్వ‌ర్యంలో గ‌జ‌మాల‌తో స‌న్మానం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ (టీపీసీసీ) ఉపాధ్య‌క్షులు ఎం.ర‌మేష్ మ‌హారాజ్ జ‌న్మ‌దిన వేడుక‌లు తాండూరులో ఘ‌నంగా నిర్వ‌హించారు. శుక్ర‌వారం ఎం.ర‌మేష్ మ‌హారాజ్ జ‌న్మ‌దినాన్ని పురస్క‌రించుకుని యూత్ కాంగ్రెస్ తాండూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు బంటు వేణుగోపాల్ ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు.
ప‌ట్ట‌ణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ర‌క్త‌దాన శిబిరానికి పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లివ‌చ్చి ర‌క్త‌దానం చేశారు. అనంత‌రం కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ఎం.ర‌మేష్ మ‌హ‌రాజ్‌ను యూత్ కాంగ్రెస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు బంటు వేణుగోపాల్ ఘ‌నంగా స‌న్మానించారు. ఎం.రమేష్ మ‌హ‌రాజ్ చేతుల మీదుగా కేక్‌ను క‌ట్ చేసి జ‌న్మ‌దిన సంబ‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు.
ఈ సంద‌ర్భంగా పార్టీ సీనీయ‌ర్, జూనియ‌ర్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, అభిమానులు ర‌మేష్ మ‌హ‌రాజ్‌ను ఘ‌నంగా స‌న్మానించారు. అనంత‌రం యూత్ కాంగ్రెస్ అధ్య‌క్షులు వేణుగోపాల్ మాట్లాడుతూ రానున్న రోజుల‌లో ఎం.ర‌మేష్ మ‌హ‌రాజ్ పేరుతో సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతామ‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాళికాదేవి ఆల‌యంలో…
మ‌రోవైపు తాండూరు ప‌ట్ట‌ణంలోని కాళికాదేవి ఆల‌యంలో కూడ టీపీసీసీ ఉపాధ్య‌క్షులు ఎం.ర‌మేష్ మ‌హారాజ్ జ‌న్మ‌దిన వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు.
ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు లొంక నరసింహులు, తాండూరు నియోజకవర్గ ముదిరాజ్ యువజన సంఘం అధ్యక్షులు ఎస్పీ రవికాంత్, పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్, బీసీ సంఘం తాండూరు కన్వీనర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రమేష్ మహారాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గజమాలతో శాలువాలతో సన్మానించి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు, బీసీ సంఘం సభ్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.