నిరుద్యోగులకు శుభవార్త..!
– డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ల ఆహ్వానం
– తుది గడువు ఎప్పటి వరకు అంటే
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. ఏ. వంసత కుమారి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్-1, తెలుగు-1, వాణిజ్య శాస్త్రం ఇంగ్లీష్ మీడియంలో-1, ఉర్దూమీడియంలో మరొక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యూయేషన్ పూర్తి చేసి ఉండాలని, పీహెచ్/ఎస్ఈటీ/ఎస్ఈటీ కలిగి ఉన్నవారి ప్రాధాన్యత ఉంటుందన్నారు. బోధన అనుభవం ఉన్న వారు సర్వీసెస్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు రేపు అనగా 10వ తేది మంగళవారం సాయంత్రం 4గంటలలోపు కళాశాలలో దరఖాస్తులను సమర్పించాలని సూచించారు.
ఇదికూడా చదవండి…

