ఓటరు జాబితాలో అక్రమాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఓటరు జాబితాలో అక్రమాలు..!
– చనిపోయిన, కొత్త ఓటర్ల నమోదులో నిజాలు తేల్చండి
– అవకతవకలు సరి చేశాకే మున్సిపల్ ఎన్నికలు జరపాలి
– తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకుల డిమాండ్
– మున్సిపల్ ముసాయిదా జాబితాపై తీవ్ర అభ్యంతరం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధి ఓటరు జాబితాలో అక్రమాలు జరిగాయని స్థానిక బీఆర్ఎస్ పార్టీ నేతలు అన్నారు.
ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీ సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు ఆధ్వర్యంలో నాయకులు శ్రీనివాస్ చారీ, మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్‌, మాజీ కౌన్సిలర్లు అనురాధ, సంగీత ఠాకూర్ తదితరులు మున్సిపల్ కార్యాలయం ఓటరు జాబితాపై అభ్యంతరం తెలిపి ఫిర్యాదు చేశారు. అనంరతం పలువురు మాట్లాడుతూ 2019 సంవత్సరంలో జరిగిన గత మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు 64వేల 90 మంది ఉండగా ప్రస్తుతం ప్రకటించిన ముసాయిదా జాబితాలో 77వేల 110 మందికి చేరుకున్నారని తెలిపారు.

అయితే ప్రతి వార్డులో 300ల నుంచి 500ల మంది ఓటర్లు పెరగడం, ఒకే వార్డులో ఇతర వార్డులకు చెందిన ఓటర్లను చేర్చడం పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. దీంతో పాటు గ్రామాలకు, తాండాలకు చెందిన ఓటర్లు పట్టణంలో నమోదు కావడం, దీని వెనుక ఏం కుట్రలు దాగి ఉన్నాయో అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపల్ ముసాయిదా ఓటరు జాబితాలో అక్రమాలు జరగాయని అన్నారు. ఓటరు జాబితాలో చనిపోయన వారి వివరాలు, కొత్తగా నమోదైన ఓటర్ల వివరాలు స్పష్టం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వాటిని సరిచేయాల్సిన అవసరముందని అన్నారు.

అదేవిదంగా వార్డుల వారిగా ఉన్న పోలింగ్ స్టేషన్ల మ్యాప్‌లను కూడా అధికారులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల ఓటరు జాబితాలో అక్రమాలను సవరించిన తరువాతనే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి మాజీ వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం, యూనుస్, సంజీవరావు, రవీందర్, రాజన్ గౌడ్, ఇంతియాజ, బషరత్ అలీ, ఎర్రం శ్రీధర్, నేతలు, కార్యకర్తలు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

రిజర్వేషన్‌లపై టెన్షన్..!