మహిళలను గౌర‌వించ‌డం సంప్ర‌దాయం

తాండూరు వికారాబాద్

మహిళలను గౌర‌వించ‌డం సంప్ర‌దాయం
– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : సమాజ నిర్మాణంలో కీల‌క‌మైన మహిళలను గౌర‌వించ‌డం మ‌న సంప్ర‌దాయ‌మ‌ని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని 25వ వార్డులో ఉన్న అంగన్వాడి కేంద్రంలో మహిళ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభాకర్ గౌడ్ హాజరై అంగన్వాడి టీచర్లు, ఏఎన్ఎంలు, ఆర్పీలు, ఆశ వర్కర్లను ఘనంగా సన్మానం చేశారు. అనంతరం మ‌హిళ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పలు పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర కీలకమని అన్నారు. ప్రతి ఒక్కరు మహిళలను గౌరవించాల‌న్నారు. అదేవిధంగా మ‌హిళ‌లు అన్ని రంగాల్లో రాణించేందుకు కృషి చేయాల‌న్నారు. త‌న కాళ్ల‌పై నిల‌బ‌డి ఆత్మ‌గౌర‌వంతో మెల‌గాల‌న్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు, ఆంగన్వాడి చిన్నారులు పాల్గొన్నారు.