కాంగ్రెస్ పార్టీలో జోక్యం తగదు
– టికెట్ కేటాయింపు నిర్ణయం అధిష్టానందే
– టార్గెట్ రాజకీయాలు చయొద్దు
– కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ వ్యవహరాల్లో జోక్యం చేసుకునేలా విమర్శలకు దిగడం తగదని ఆ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా కేఎల్‌ఆర్‌కు ప్రకటిస్తుందనే ఊహాగానాలపై బీసీ సంఘం జాతీయ కార్యవర్గ నేత చేసిన వాఖ్యలను ప్రభాకర్ గౌడ్ ఖండించారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. టిక్కెట్ కేటాయింపు నిర్ణయం అధిష్టానమే చూసుకుంటుందన్నారు. బీసీలపై అంత ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీ తాండూరు టిక్కెట్‌ను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ బీసీ సామాజిక నేతకే అవకాశం ఇస్తుందని, బీజేపీ కూడా బీసీలకే అవకాశం ఇవ్వొచ్చని, అప్పుడు బీసీలుగా వారికి మద్దతు తెలిపే అకాశం ఉందన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకుని వాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు చేయడం పద్దతి కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు టికెట్ ఇవ్వకపోతే ఓడిస్తామని అనడం భావ్యం కాదన్నారు.
ఇది కూడా చదవండి…

