సీఐ జలంధరుడికి గ‌జ‌స‌త్కారం..!

తాండూరు వికారాబాద్

సీఐ జలంధరుడికి గ‌జ‌స‌త్కారం..!
– భారీ గజమాలతో సన్మానించిన బోయ అశోక్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: బ‌దిలీపై వెళుతున్న తాండూరు రూరల్ సీఐ జలంధర్ రెడ్డికి ఘ‌న స‌త్కారం ల‌భించింది. రూరల్ సీఐ జలంధర్ రెడ్డి తాండూరు నుంచి బదిలీ అయిన నేపథ్యంలో సోమవారం తాండూరు పట్టణ సమీపంలోని భవానీ ఫంక్షన్ హాల్లో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బోయ అశోక్ సీఐ జలంధర్ రెడ్డిని భారీ గజమాలతో ఘనంగా సన్మానించి సీఐపై ఉన్న వీరాభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ తాండూరు రూరల్ సీఐగా 32 నెలల పాటు జలంధర్ రెడ్డి అందించిన సేవలను గుర్తుచేస్తూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు రాము, సుధాకర్, కృష్ణకాంత్, నరేందర్ తదితరులు ఉన్నారు.