మోబైల్ షాపు దొంగలు దొరికారు..!
– ఇద్దరిని రిమాండ్ చేసిన తాండూరు పోలీసులు
– వివరాలు వెల్లడించిన పట్టణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: పాత కేసులో నిందితులైన ఇద్దరు దొంగలను తాండూరు పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. గతంలో ఈ దొంగలు మోబైల్ షాపులో చోరీ చేసినట్లు వెల్లడయ్యింది. మంగళవారం రాత్రి తాండూరు పట్టణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ ఓ ప్రకటనలో వివరాలను వెల్లడించారు. మంగళవారం ఉదయం 5గంటల ప్రాంతంలో పట్టణంలోని నెహ్రు గంజ్ సమీప ప్రాంతాలలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పందగా తిరగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో ఒకరు హైదరాబాద్ ఆసిఫ్ నగర్ జిరా ప్రాంతానికి చెందిన అబ్దుల్ వహీద్‌గా, మరొకరరు వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోకపస్లబాద్కు చెందిన మహమ్మద్ ఖాదర్‌గా గుర్తించారు. తాండూరులో సెంట్రీంగ్ కూలీ పనులకు వచ్చే క్రమంలో వైన్ షాపు వద్ద వీరికి పరిచయం ఏర్పడింది. నాలుగు నెలల క్రితం పట్టణంలోని పెట్రోల్ బంకు నుంచి నెహ్రు గంజ్‌కు వెళ్లే మార్గంలో ఉన్న మోబైల్ షాపులో చోరీకి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో నిర్దారణ అయ్యింది. ఆ చోరీలో 3 సెల్ ఫోన్లు, నగదును ఎత్తికెళ్లినట్లు నేరాన్ని అంగీకరించారు. అదేవిధంగా వారి నుంచి 2 మొబైల్ ఫోన్లు రూ. 10,000/- నగదును స్వాదీనం చేసుకున్నట్లు ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీస్ కానిస్టేబుళ్లు శివ, అంజద్, షబ్బీల్, నర్సింహాలు ఉన్నారు.

